Thursday, September 25, 2008

అమ్మా... నేనేం చేసాను ?!!



అమ్మా... నేనేం చేసాను ?!!
ఎందుకు నన్ను వెళ్ళగొడుతున్నావూ..?
పువ్వు లాంటి నీకు నేను భారంగా ఉన్నానా ??
భారంగా ఉన్న నేను నీకు నొప్పి కలిగిస్తున్నానా??
క్షమించమ్మా.. ఇంకెప్పుడూ నిన్ను బాధపెట్టను
లేదమ్మా... నన్ను వెళ్ళనివ్వకమ్మా..
వద్దమ్మా... నన్ను వదలద్దమ్మా..
అమ్మా... అమ్మా.. వదలద్దమ్మా....
అమ్మా... అమ్మా.. అమ్మా... అమ్మా.....!

.......................................
........................................

నన్ను కడుపులోంచి వెళ్ళగొట్టింది, గుండెల్లో చేర్చుకోవటనికా..
నాపై కాఠిన్యం చూపించింది, కమ్మని ఒడి పరిచేందుకా..
నీ కష్టాన్నంతా గొంతులో పట్టింది, నాకు జీవం పోసేందుకా..
ఎంత మూర్ఖురాలిని...!!
నిన్ను అర్థం చేసుకోలెకపోయనమ్మా... ఇన్నాళ్ళూ..!!

చూపును చూసి, వెనకున్న ఆలోచనని చదివేస్తావు.
స్వరాన్ని బట్టి, గుండెలోని భావాన్ని కనిపెట్టేస్తావు.
'నువ్వు నా దానవే..' అని ప్రతి క్షణం నన్ను హత్తుకుంటావు.
'నా లోకం నువ్వేనంటూ..' నా కోసం లోకాన్ని, నాన్నని సైతం ఎదిరిస్తావు..!

నీ కలల్లో నా భవిష్యత్తుని చూస్తూ,
నీ కనుబొమ్మల్లో నాకై తపనను ముడుస్తూ,
నీ కళ్ళళ్ళో నా సంతోషాన్ని చూపే...
నా చిట్టి తల్లీ.., నీ ఋణం ఎలా తీర్చుకోనే....?!

ఓ మాట చెప్పనా అమ్మా...?
I Love You :)

19 comments:

Anonymous said...

hmm

good one...

చిలమకూరు విజయమోహన్ said...

చాలా బాగుంది.

Srividya said...

చాలా బాగుంది.

చైతన్య.ఎస్ said...

nice one

Purnima said...

Loved it! Wish we could really say often words like "Love you", "Sorry", "Thanks" etc to the most important person in our lives. Sometimes, we take her for granted!

Nice post, keep writing!

pruthviraj said...

నన్ను కడుపులోంచి వెళ్ళగొట్టింది, గుండెల్లో చేర్చుకోవటనికా..
చాలా బావుంది మోహన గారు..THANX for response. :D

Bolloju Baba said...

very beautiful
bollojubaba

రాధిక said...

beautiful
:) okasari 4 eallu venakki vellaanu.

ప్రపుల్ల చంద్ర said...

చాలా బాగుంది.

Anonymous said...

Nice one. keep writing

-deepa

ప్రతాప్ said...

చిత్రం అద్భుతమైతే,
చిత్తరువు లాంటి మీ భావన అత్యద్భుతం.

మురారి said...

baagundi kaanee koncham ekkuva dramatic ga anipinchindi.

మోహన said...

Thank you every one.

@Radhika
:)

@Murari
hmmm.. Thank you. dramatic... you mean 'not practical' ? May be it is more emotional.. No wonder. we cannot see beyond our experience or imagination.

pruthviraj said...

మోహన గారు, మీ కవితలోని అమ్మపై ప్రేమ ద్వారా నా చిత్రము మీ కవితకు దగ్గరై ఇలా బ్లాగులో చేరి పరొక్షంగానైనా నాకు కొంత ఓదార్పు ఇచ్చింది అని అనుకుంటున్నాను. కవితల మాటలవెనుక నిండిన ప్రేమలను గమనిస్తూ ఇలా బ్రతికేస్తున్నాను. నా బ్లాగులో మీ కామెంట్లు పదేపదే మాట్లాడించినట్టనిపించింది. బొమ్మ తప్పకుండా పెట్టుకోవచ్చు. నిజంగా అమ్మమనసును బాదపెట్టిన గుండెకొత వర్ణనాతీతం. ఐ లవ్ యూ అమ్మా..

మోహన said...

@ పృథ్వీరాజు గారూ..

అవునండీ, అమ్మ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. కానీ చాలా కొన్ని సందర్భాల్లోనే ఆమెను గ్రహించగలుగుతాం. పైన పూర్ణిమ చెప్పినట్టు, most of the times, we take her for granted!

చిత్రాన్ని ప్రచురించేందుకు అనుమతిచ్చినందుకు ధాంక్సండి.

కొత్త పాళీ said...

చాలా బావుంది.
అమ్మ - పిల్ల సంబంధాన్ని మృదువుగా, అనవసరపు సెంటిమెంటు లేకుండా చక్కగా చిత్రించారు.
అన్నట్టు, సారీ థాంక్సు లు అక్కర్లేదేమో గానీ ఐ లవ్ యూ చెప్పడం ఇంపార్టెంటే నా ఉద్దేశంలో

teresa said...

కవిత,బొమ్మ దేనికదే సాటి..
Beautiful expression!

జ్యోతి said...

మోహన,

చాలా బావుంది .. నిజంగా అమ్మకు I Love You అని ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు కాని ఆ ఒక్క పదం ఎన్నో భావాలను చెప్పకనే చెప్తుంది.

మోహన said...

@కొత్త పాళీ గారూ..

అవునండీ..'ఇ లవ్ యు' చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో సారీ కూడా అనుకుంట.. థాంక్స్ అక్కర్లేదని నా ఉద్దేశం.

@teresa
Thank you.

@జ్యోతి
100% agree with u. ఈ విషయం నేను గ్రహించేందుకు కారకులయిన అందరికీ నా కృతజ్ఞతలు.