Monday, September 15, 2008

ఆకాశం రంగేమిటో..?!

ఆకాశం రంగేమిటో.....?!

చచ్చు ప్రశ్న... "ఆకాశం రంగేమిటి" ఏమిటి.. వెధవ పైత్యం కాకపొతే...!
నీలంగా ఉంటుంది. అది కూడా తెలియదా...?!!

హ్మ్.. తెలుసు.. ఆకాశం కేవలం పగటి వెలుగులో మాత్రమే నీలం రంగులో ఉంటుంది. సూర్యోదయ సమయంలో నలుపు నుంచి, బూడిద రంగులోకి, అటుపై గులాబి, ఎరుపు, సిందూర వర్ణాలు పులుముకుని, ఆఖరుకి, నీలంగా మెరుస్తుంది. సాయంత్రానికి మళ్ళీ సిందూరం,ఎరుపు,గులాబి, బూడిద వర్ణల్లోకి మారుతూ.. మెల్లగా నలుపు పులిమేసుకుంటుంది.

మరి అసలు ఆకాశం రంగేమిటీ??!!

ఆ ఆకులు...?? హ్మ్.. అదే ప్రశ్న.. ఆ ఆకుల రంగేమిటి ?!!

ఆకుపచ్చ.. మళ్ళీ అదంతా పగటి వెలుగులోనే... అ వెలుగు సన్నగిల్లే కొద్దీ... అవి కూడా నలుపే పులుముకుంటున్నాయి..

వెలుగులోనే అసలు రంగు బయట పడుతుంది అంటారు. కానీ ఆ వెలుగు ఎప్పుడూ ఒకలా ఉండదే...!! మరి అసలు వెలుగు ఏది, అసలు రంగు ఏది ఎలా చెప్పగలం ??

పగటి పూట మనకి కనిపించే ఆ రంగులు, వెలుగును తీసుకుని, వెన్నక్కి ఇచ్చే వర్ణాలు కదా.. ఐతే.. వాటి అసలు రంగు ఏమిటి?? అసలు ఏదైనా రంగు ఉందా లేదా?? ఏమీ ఇవ్వకపోతే ? మన ఉనికే లేదా ?? అసలు వెలుతురే లేకపోతే అప్పుడు మన రంగు?

ఎవరూ చూడనప్పుడు మనం ఎలా ఉంటామో అదే మన నిజమైన తత్వం అంటూ ఉంటారు. అంటే.. నలుపే [చీకటే] నిజమా..?? వెలుగు మాయా..??

లోకంలో రంగుల్ని..చూస్తూ ఆనందించే నాకు.. ఒక్కసారిగా ఇవన్నీ నన్ను మోసం చెయ్యటానికి సృష్టింపబడిన వాటిలా, మాయలా, భ్రమలా కనిపిస్తున్నాయి....నలుపొకటే నిజంలా తోస్తోంది... !!

ఎంటో ఈ కృష్ణ [నల్లని] మాయ నాకు....

18 comments:

Purnima said...

antaa maayaa! antaa midhya! ante.. adi ante! iMkemi ledante..

:-)

Purnima said...
This comment has been removed by the author.
Kathi Mahesh Kumar said...

హమ్మో! చాలా లోతైన ప్రశ్నలు అడిగేస్తున్నారు. వెలుగు ప్రతిఫలించడాన్నిబట్టి ప్రకృతి రంగులు మారుతాయి.మన "impressions" నిబట్టి మనుషుల స్వభావాల అంచనా జరుగుతుంది. రెండూ అర్థసత్యాలే..అప్పటికి మాత్రం నిజాలే!

Anonymous said...

ఏమండోయి చుక్కలు అందం చీకటిలోనే కదా....
రంగు నే కాక రంగు రుచి చిక్కదనం.... ఇలా ఏంటేంటో ఆలోచనలు వచేస్తున్నాయి.
మీరు ఇప్పటికి మొదటి వాఖ్యంతో సరి పెట్టుకోండి....

వంశీ కృష్ణ

Anil Dasari said...

>> నలుపే [చీకటే] నిజమా..?? వెలుగు మాయా..??

>> ....నలుపొకటే నిజంలా తోస్తోంది...

తాత్వికంగా చెప్పినా, శాస్త్రీయంగానే చెప్పారు. వాతావరణాన్నిబట్టి మనకి కనిపించే ఆకాశం రంగులుంటాయి. భూమ్మీద ఎక్కువగా నీలాకాశం, మార్స్‌కి రుధిరాకాశం .. అలా ఒక్కో గ్రహానికీ ఒక్కో రంగన్న మాట. అసలు వాతావరణమే లేకపోతే? అప్పుడు కనిపించేది మాత్రం మీరన్నట్లు శ్యామలాకాశమే. నలుపే నిజం.

Anonymous said...

సమాధానాన్ని మీరే చెపుతూ ప్రశ్నలా అడగటం చాలా గొప్ప విద్యండీ - మోహనగారూ మీకు నా అభినందనలు. ఆకుపచ్చ ఆకు చీకటిలో కూడా ఆకుపచ్చగానే ఉంది. చూడలేని మన కన్నులది తప్పు. గుడ్లగూబలాంటి మరింత విజన్‌ ఉన్న ప్రాణి అప్పుడు కూడా చూడగలదు. ఎక్కువ వెలుగు - తక్కువ వెలుగు ఉంది తప్పిస్తే చీకటి అనేది లేదండి. వెలుగు జ్ఞానం అనుకుంటే - సత్యం వస్తువనుకుంటే -మళ్ళీ చూడండి - సత్యానుభవానికి మంచి దారి పేర్చారు మీరు. అభినందనలు. వెలుగు తాలూకు స్థాయి మారుతూ ఉంటే వస్తువు రంగు మారుతుంది. నిజానికి అది ఎప్పుడూ ఒకే రంగులో ఉంది. మన కళ్ళే మనల్ని మోసం చేస్తున్నాయి.

San .D said...

ఇంటర్లో మా కెమిస్ట్రీ మాస్టారు ఆకాశం నీలంగా ఉండడానికి కారణం నీలపు రంగులో ఉండే ఓజోన్ మాలికూల్స్ అని సెలవిచ్చారు.

ఆ దెబ్బతో కళ్ళు తెరుచుకున్నాయి.

రాధిక said...

నిజమేనేమో..నలుపే సత్యమేమో!

శేఖర్ పెద్దగోపు said...

నలుపే నిజం అని అందరూ నమ్మితే ఎంత బావున్నో.....జాతి వివక్ష లాంటి సమస్యలు వుండవు.

మోహన said...

@Purnima,
I am still waiting for your thoughts..

@మహేష్
>>అప్పటికి మాత్రం నిజాలే!
Perfect. అంటే.. అప్పటి తరువాత మర్చిపోవాలనా..?

@వంశీ కృష్ణ
>>చుక్కలు అందం చీకటిలోనే కదా....
Right! :)

@అబ్రకదబ్ర
Thank you.. :)

@చివుకుల కృష్ణమోహన్‌ గారూ..
మీ నుంచి అభినందన అంటె..అది నేనో పెద్ద achievement గా భావిస్తున్నాను. Thank you.

@సందీప్
తెరుచుకున్నాయి నావి కూడా.. :)

@రాధిక
ఎమో అవునెమో..! అదే నిజమేమో...!!

@ P L Sekhar
నిజమేనండీ.. ఈ ఆలోచన కూడా బాగుంది.

కొత్త పాళీ said...

"కృష్ణుడు దిగంబరుడు
కృష్ణుడు శ్యామం
ఏమీ లేనిది నీలం
ఆకసం ఏమీ లేనిది"
సంస్కృతంలో నీల = నలుపు.
మంచి పట్టు పట్టారు మోహనా.
ఇంకో చిన్న తమాషా కూడా ఉంది. ధ్యానం, ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళు (అన్ని మతాల వాళ్ళూ) వాళ్ళు పొందే దివ్యానుభూతిని ప్రకాశవంతమైన కాంతితో పోల్చడం సాధారణంగా వింటు ఉంటాం. కానీ అలాంటి విషయాలు బాగా తెలిసినాయన చెప్పారు, ఆ స్థితిలో కనబడేది చిమ్మ చీకటి మాత్రమే నని.

వింజమూరి విజయకుమార్ said...

ఈ టపా ఒక ప్రాకృతిక సాహిత్యం అనుకుంటే నేను ఇక్కడ ఏమీ చెప్పలేను. కానీ రంగుల ప్రస్తావన చెప్పాలంటే కొద్దిగా చెప్పగలను. అసలు సైన్సు ప్రకారం మౌలిక వర్ణాలు మూడే. అవి ఎరుపు, ఆకుపచ్చ, నీలం అంటే Blue Colour. ఎరుపు, ఆకుపచ్చ పరస్పర వ్యతిరేక రంగులు + నీలం అంటే Blue రంగు కలిస్తే తెలుపురంగు. అంటే తెలుపురంగులో లోకంలోని అన్ని రంగులూ కలిసి వున్నాయన్న మాట. ఇదే వెలుగు కూడా. అంటే వెలుగుది తెలుపు రంగన్నమాట. ఇక మిగిలింది నలుపురంగు. నలుపురంగంటే ఏ రంగూ లేక పోవడమన్నమాట.ఏ రంగూ లేకపోవడం అంటే అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టం. ఇది రంగుల అసలు కథ. ఇక మీ ప్రశ్నకి సమాధానం నాకు తెలిసినంత వరకూ నలుపూ, తెలుపూ రెండూ నిజాలే. ఏమంటారు?

మోహన said...

@కొత్త పాళీ గారూ
మీ వ్యాఖ్య బాగుంది. Thank you.
>>కానీ అలాంటి విషయాలు బాగా తెలిసినాయన చెప్పారు, ఆ స్థితిలో కనబడేది చిమ్మ చీకటి మాత్రమే నని.
ఇంకొంచం వివరణ ఇవ్వగలరా..?

@వింజమూరి విజయకుమార్
నలుపు, తెలుపూ రెండూ నిజమా..? మరైతే ఆ రెండిటినీ మోసేది ఏది ?
నిజమంటే..?? విభజింపబడేదా? ఇక విభజించలేనిదా?

S said...

చాలా బాగుందండీ మీ "ఆకాశం రంగేమిటో?" నాక్కూడా అదే అనుమానం మొదలైంది చదివి... :)

సుజ్జి said...

vammo....!! aentandi.. burrani maree vedakkinchestunnaru.. manchi expressions.

సుజ్జి said...

vammo....!! aentandi.. burrani maree vedakkinchestunnaru.. manchi expressions.

నాగప్రసాద్ said...

"జగమే మాయ, బ్రతుకే మాయ వేదాలలో సారమింతే" అన్నాడు దేవదాసు.

"మాయ మాయ మాయ అంతా మాయ
ఛాయ ఛాయ ఛాయ అంతా ఛాయ" అన్నాడు బాబా.

నలుపొక్కటే నిజం ఈ ప్రపంచంలో. మిగిలినదంతా మాయే.

మోహన said...

@s
:) Sorry to confuse you.

@sujji
burra unnadi amduke kadandi.. ;)

@nagaprasad
Thank you