మెల్లగా, ఓపికగా, వరుసగా...
ఒక్కొక్కటిగా.. ముచ్చటగా...
నే అందిపుచ్చుకున్న ముత్యాలను పేరుస్తూ...
ఒక[నా] మాలని గుచ్చుతున్నాను...
నన్ను అలంకరించు కునేందుకు..!
మొదటి సారి తెగిపోయింది :-(, మళ్ళీ గుచ్చాను..నమ్మకంతో..
రెండావసారి కొట్టుకుపోయింది, కొత్తగా పేర్చాను.. ఈదిన అనుభవాలతో..
మూడవసారి మాసిపోయింది, జాగ్రత్తగా శుభ్రపరిచాను.. ప్రేమతో..
ఇప్పుడు మాయమైపోయింది, ఒంటరిగా మిగిలిపోయాను.. అయోమయంలో..!!
8 comments:
chaala loothuga, hrudhyam ga undi..
రెండోసారి చదివితేగానీ, కవిత లోతులోకి దిగలేకపోయాను. బహుశా కొంత "..." వీటి ప్లేస్ మెంట్లో సమస్యేమో...కొంచెం చూసుకోండి!
చాలా చాలా బాగుంది.
ఈ ముత్యాలు, స్వాప్నికజగత్తులో దొరికిన కలల ముత్యాలా?
ఈ ముత్యాలు, ఊహాలోకంలో దొరికిన విరిజాజి పువ్వులా?
ఈ ముత్యాలు, గగన విరిసీమలో విరిసిన తారకల మెరుపులా?
ఈ ముత్యాలు, గడ్డిపూలపై నిలిచిన తుషారబిందువుల విరుపులా?
ఈ హారపు దారం, నా కన్నీటి చారికల మరకనా?
ఈ హారపు దారం, నా పన్నీటి హారికల జిలుగులా?
ఈ హారపు దారం, నా ఆశల కలబోతనా?
ఈ హారపు దారం, నా అడియాసల............
@Purnima, Sujji, Murali,
Thank you
@ మహేష్
ఇకపై జాగ్రత్త పడతాను సర్. Thank you.
@ప్రతాప్
మీ కవిత చాలా బగుందండీ.
అలా నిలదీస్తే.. ఏమని చెప్పను.?
నన్ను నే అలకరించుకునేందుకు పేర్చుకుంటున్న ముత్యాల మాల అది..
ఆ ముత్యాలు.., నే అనుభవించి, పరవశించి, తరించాలనుకునే బంధాలు. అలాంటీ మాలకు ఆధారం మనసే కదా..!
wonderfulll... chala chala bagundi...
nice one.
@Chaitu,Murari
Thank you.
Post a Comment