Wednesday, September 17, 2008

..తామర క్షణం..

జీవితంలో ఇవి నావి, నా ఆస్థి అని చెప్పుకోగలిగేవి కేవలం నా క్షణలేనేమో..! అలాంటి వాటిని ఉదయం లేచిన దగ్గరనుంచి.. పడుకునే దాకా... ఎదో ఒకటి చేస్తూనో, ఎమీ చెయ్యకుండానో.. ఈ రోజుకు కావాల్సినవి సమకూర్చుకుంటూనో....నిన్న కూర్చుకున్న వాటిని వదిలించుకుంటూనో .. రాబోయే రేపు కోసం కష్టపడుతూనో, కలలు కంటూనో.. ఆలోచిస్తూనో... అర్థం లేకుండానో... సలహాలిస్తూనో, సంజాయిషీలు చెప్పుకుంటూనో... గడిపేస్తున్నాను.

ఇలా కరిగిపోతున్న వాటిలో నే జీవించేది ఎన్ని? వాటిలో ఎన్నింటిని నేను అచ్చంగా నావిగా పోగుచేసుకుంటున్నాను..? అసలు అచ్చంగా నావి అంటే ఏవి? నా కోసమై నే గడుపుకునే క్షణాలా..? లేక నాకు ఇష్టమైనది చేస్తూ గడిపే క్షణాలా?

అయ్యో... ఇలా తికమకపెట్టే ఈ ఆలోచనల బురదలో ఇప్పుడే ఒక తామర క్షణం.. విరిసి, మెరిసి, "నువ్వు జీవించేది ఇక్కడ" అని చెప్తూ, [నువ్వు నన్ను పట్టుకోలేవన్నట్టు] నన్ను చూసి కొంటెగా నవ్వుతూ, నే గ్రహించేలోపే మాయమయ్యింది.... అరే.. ఏం చేసాను నేనా క్షణం..? ఏదీ..నే జీవించిన నా క్షణం....?? ఎమో.. ఎటెళ్ళిందో తెలీదు!! తను విచ్చినప్పుడు [క్షణం కంటే వేగంగా] వ్యాపించిన ఆ సువాసన మాత్రం ఇంకా అలానే ఉంది. తను నా భ్రమ కాదని, నాకు తెలపటానికన్నట్టు....

18 comments:

shaneer babu said...

మోహన గారూ తామర క్షణం ఇప్పుడే చూసా...పదాల కూర్పు బావుంది చక్కటి భావుకత కనిపించింది....

Kathi Mahesh Kumar said...

కొన్ని అనుభవాల్ని అక్షరబద్ధం చెయ్యలేమని నా ప్రఘాఢనమ్మకం. కానీ ఇలాంటి టపాల్ని చదువుతున్నప్పుడు నా ఆలోచన తప్పుగా అనిపిస్తుంది...

మాగంటి వంశీ మోహన్ said...

బావుంది మీ టపా..:)...

అసలయినా మీ టపా హెడ్డింగు చూసి నేను ఏదో ఊహించుకున్నాను. ఎందుకు అలా ఊహించుకోవాల్సి వచ్చిందంటే నిన్న పానుగంటి వారి వ్యాసాలు వందో సారో, నూట యాభయ్యోసారో చదివా. అందులో తామర తగ్గించడానికి కంపనీలు అమ్మే మందుల ప్రకటనల గురించి ఆయన రాసిన వ్యాసం చదివి కడుపుబ్బిపోయింది. నవ్వులతో ఆ ఉబ్బు తగ్గిందనుకోండి అది వేరే సంగతి ...

Purnima said...

NICE ONE! :-)

చిలమకూరు విజయమోహన్ said...

చక్కగా మీ ఆలోచనలను అక్షరబద్దం చేశారు.

మెహెర్ said...

Loved it.

Bolloju Baba said...

బాగుంది
బొల్లోజు బాబా

శేఖర్ పెద్దగోపు said...

టపా ఆద్యంతం ఆసక్తిగా చదివించింది. చివరిలో expression బావుంది. తామర క్షణం అని ఎందుకు టైటిల్ పెట్టారో తెలుపగలరు. దాని అర్ధం కూడా.....

శేఖర్ పెద్దగోపు said...
This comment has been removed by the author.
శేఖర్ పెద్దగోపు said...
This comment has been removed by the author.
మోహన said...

@భగవాన్ గారూ..
నేను మీ కార్టూన్స్ కి చాలా పెద్ద అభిమానిని.. చిన్నప్పుడు ఎక్కువగా చదివేదాన్ని. అవి చదివేస్తే పుస్తకం చదివేసినట్టే నాకు.. మిమ్మల్ని ఇక్కడ, ఇలా కలుసుకోవటం చాలా సంతోషంగా ఉందండీ..

@మహేష్..

ఆలా అనుకునే వాళ్ళలో నేను ఉండేదాన్ని... కనీ ఇలాంటి వ్యాఖ్యలు చూసి, ఆ అభిప్రాయం మార్చుకుంటున్నాను. పైగా నేను కూడా అలాంటివి రాయగలుగుతున్నానని మిరంతా అంటుంటే.. చాలా ఆనందంగా ఉంది. నెనర్లు..

@Vamsi
తామరకి ఆమరో అర్థం నాకు అసలు తట్టనే లేదండీ..హహహ.. Thank you. :)

@purnima, Vijay mohan, @బాబా గారూ..
Thank you.

@ఫణీంద్ర
Thank you. Happy to see your comment here.

@P L Sekhar
ఒక మనిషి, ఒక బురద, ఒక తామర, ఒక నవ్వు, ఒక క్షణం..!! అదీ స్టోరీ.. :)

కొత్త పాళీ said...

శబాసో!

నిషిగంధ said...

తాత్వికతలో భావుకత!! చాలా బావుంది..

మురారి said...

I never thought of expressing this kind of feelings in writing. May be I had a feeling internally that I could not express them clearly. U did it beautifully.'taamara kshaNaM' anna prayogam baagundi.

భావకుడన్ said...

మీరు బ్లాగీకరిస్తున్న ఈ టపాలన్నీ "మీ తామర క్షణాలే" కదా...ఆ క్షణ బందురమైన తామరలను చిరంజీవులను చేయటమే ఈ బ్లాగీకరణ అని అనిపిస్తుంది. అర విరిసిన తామర ఎదురుగా ఉన్నా చూసుకోవట్లేదేమో చూడండి :-)

తాత్వికత, భావుకత రెండూ సమ పాళ్ళలో పండించారు. అభినందనలు.

మోహన said...

@మురారి
Thank you.

@భావకుడన్
>>అర విరిసిన తామర ఎదురుగా ఉన్నా చూసుకోవట్లేదేమో చూడండి :-)

కనిపించేది ఆ తామర వ్యాపింపచేసిన సుమగంధమే కానీ తామర కాదేమోనండీ.. :-) Thank you.

సుజ్జి said...

hmmm.. mana kosam manam brathike aa taamara kshnalu rojuku vakka saranna kaavali..

మోహన said...

@sujji
hmm. Right!