పగలు అలసటని పోగుచేసి కానుకగా ఇచ్చింది.
అది దాచుకున్న నా కళ్ళను, సంధ్య కిరణాలతో నిమురుతోంది.
తను వెళుతూ వెళుతూ, తెర వేస్తున్న నిశికి నన్ను అప్పగించింది.
అతడి కోసం చూసే ఎదురుచూపులో ఆమే నాకు తోడయ్యింది.
అతడి వెలుగు అనుభవించటానికి ఆమెను హత్తుకున్నాను.
తనని నాలో ఏకం చేసుకుని, ఒంటరిగా మిగిలాను.
అతడు వచ్చే వేళకి, అంధకారంగా నిలిచాను.
--------------------------------------------------------------------------
పెద్ద కిటికీ లో నుంచి కనబడే చందమామను చూసి ఆనందించేందుకు దీపాలు ఆర్పి మరీ వేచి చూసే నాది గుడ్డి ప్రేమే అనుకుంటా...!
4 comments:
బాగుంది.. చీకటితో వచ్చే "అతడి" కోసం చీకటితోనే స్నేహం... హమ్మ్!!
తనని నాలో ఏకం చేసుకుని, ఒంటరిగా మిగిలాను. - మమేకమైనాక... ఒంటరితనం?? మీరు వివరిస్తేగానీ అర్ధం చేసుకోలేదు.. చిట్టి బుర్ర!!
My imaginations are running wild after reading this.. hehehe ;-)
బాగుంది మోహనా... నేను రాసినవి చదువుకుంటున్నట్టే ఉంది... ఈ క్షణంలో నా "పున్నమి రాత్రి చిమ్మ చీకటి రాజ్యమేలింది..." గుర్తొచ్చింది...
అక్కడ ఏకం చేసుకుంది అంధకారాన్ని... అతడిని కాదు...
@Purnima
Thank you. running wild ? :)
నే రాసింది నెనే మళ్ళా చదువుకున్నప్పుడు, పరినీతలోని పాట, మీరు రాసిన 'మోసం' గుర్తొచ్చాయి దిలీప్ గారూ..
Post a Comment