Thursday, February 19, 2009

..हम and జెర్రి..

అప్పుడు నేను ఏడో తరగతి అనుకుంటా... వేసవి సెలవుల్లో పెద్దమ్మ, అక్క, అన్నయ్య, పిన్ని, బాబాయి ఇంకా మా ఫామిలీ అంతా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కలిసే వాళ్ళం. అ వేసవి చల్లగా లేదు [అప్పటికి గోదావరి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు మరి!]. రాత్రి భోజనాలయ్యకా ఆడాళ్ళంతా విధి గదిలో టీ.వీ చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. నేల చల్లగా ఉండటం వల్ల ఒక్కొక్కరూ మెల్లగా నడుం వాలుస్తున్నారు. నేను అలానే వాళ్ళ కబుర్లు వింటూ పెద్దమ్మ పక్కన చేరి నిద్రపోయాను. ఎంత సేపయ్యిందో, ఏమయిందో తెలియదు. ఉన్నట్టుండి కేకలు విని ఉలిక్కిపడి లేచాను. చాలా గొంతులు వినిపించాయి.. పెద్దమ్మ కేకలు.. "కదలకు, అటే వస్తోంది" అన్న మిగతా వాళ్ళ అరుపులు. వంటగదిలో గోడ పక్కన చీపురుకట్ట ఉంది. త్వరగా పట్టుకు రా అని పిన్నితో అమ్మ అన్న మాటలు... నా నిద్ర కళ్ళకు కనిపించింది మాత్రం, మసక మసకగా ఒక చిన్న మెలికెల జీవి. ఆ అరుపులకి ఎటెళ్ళాలో తెలియక అనుకుంటా, అది కూడా తెగ అటు-ఇటు తిరిగేస్తోంది. దీనిని దూరంగా పంపటం నా కర్తవ్యం అని స్ఫురించటానికి ఆట్టే సమయం పట్ట లేదు. వెంటనే చేత్తో లాగి పెట్టి దానిని ఒకటి పీకాను. అది కాస్తా బెడ్రూం వైపు వెళ్ళి పడింది. అంతే, కొత్తగా పెళ్ళయిన మా పిన్ని.. "అమ్మో! మా ఆయన!" అంటూ బెడ్రూం వైపు చీపురుకట్టతో పరుగు తీసింది. ;)

మెలకువ వచ్చాక తెలిసింది ! అది ఒక జెర్రి అని. "బహుసా మేడ మీద నుంచి తెచ్చిన బట్టల్లోంచి పడింది." అనుకుంటారు, ఇప్పటికీ! అమ్మేమో "నీకు ఏమి కాలేదు కదా?" అంటూ నా చెతులు, వేళ్ళు క్షుణ్ణంగా తడిమి తడిమి చూసింది. కాసేపయ్యాకా అంతా చుట్టూ చేరి, 'బుజ్జీ, అసలు జెర్రి ని అంత ధైర్యం గా చేత్తో ఎలా కొట్టావే? భయం వెయ్యలేదా?' అని అడిగారు. ధైర్యమా.. పాడా!! నాకేం తెలుసు అది జెర్రి అని. నిద్రలో ఉండగా సడన్ గా లేపితే ఎవరినైనా పీకుతా. అలాగే దాన్ని కూడా పీకాను. కానీ దొరక్క దొరక్క దొరికిన సువర్ణావకాశం... వదులుతానా..?! "మరేం అనుకున్నారు నేనంటే ?" అని కళ్ళెగరేసి జడ మెలేశాను నేను. అప్పట్నుంచి మనం వీర నారీ మణి కేటగిరీ ఇంట్లో.. హహ..

ఎన్ని మధుర స్మృతులో బాల్యంలో...

7 comments:

చిలమకూరు విజయమోహన్ said...

మీ పిన్ని గారికెంత ప్రేమ వాళ్ళాయనంటే..ఏదో సరదాకి

Kathi Mahesh Kumar said...

హ్మ్మ్ బాగుంది.

శేఖర్ పెద్దగోపు said...

>>అ వేసవి చల్లగా లేదు [అప్పటికి గోదావరి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు మరి!

:))

>> "..हम and జెర్రి.."

టైటిల్ బావుంది.

నాకు అప్పుడప్పుడూ అనిపిస్తుంది...నేను గాఢ నిద్రలో వుంటే మా మేనేజర్ వచ్చి లేపితే బావున్నని...

ఏకాంతపు దిలీప్ said...

జెర్రి ని లాగి పడేసి వీర నారీమణివైపోయావు... అదే అబ్బాయి అయితే ఇలా చెప్పుకుంటే నవ్వుతారు, జెర్రి ప్లేస్ లో కనీసం ఒక ఆరు అడుగుల జెర్రిగొడ్డో, నాగు పామో పెట్టుకోవాలి, అప్పుడు కానీ వీరుడని అని చెప్పుకోడానికి కుదరదు... :-D

విజయ్ గారన్నట్టు మీ పిన్ని ప్రేమ బాగుంది... మనలో మన మాట అది నిజంగా ప్రేమేనా? లేక నిద్రపాడైతే మీ బాబాయ్ తిడతారని భయమా?

మోహన said...

@విజయమోహన్ గారూ
నిజమేనండి, మా పిన్ని కి బాబాయంటే చాలా ప్రేమ. :)

@శేఖర్
హహ... అంటే మీ బాస్ కి స్పాట్ పెడుతున్నారన్నమాట.

@Mahesh
Thank you!

@దిలీప్
అంతే కదా మరీ.. ఏడో తరగతి అంటే అన్నీ అలాంటి సాహసాలే. :D ఆ వయస్సులో, ఇలాంటి వాటికి అమ్మాయో అబ్బాయో.. ఆ తేడా ఉందని నేను అనుకోను. చిన్ని చిన్ని విజయాలే అయినా అవి ఎప్పటికీ గొప్ప విషయాలే[at least నాకు]. అవన్నీ మధుర స్మృతులే... ఆ చిన్ని చిన్ని ఆనందాలు, అమాయకపు నవ్వులు, ఆటలు అవే ఈనాటి బిజీ లైఫ్లో, 'నువ్వు జీవించింది ఇలాంటి చిన్ని చిన్ని సందర్భాల్లోనే మిత్రమా...' అని గుర్తుచేస్తుంటాయి. They show me how simple life will be if we dont miss the kid within.

Thanks for bringing this out from me. :)

మా పిన్ని ప్రేమనే అనుమానిస్తారా..!!! 'కాళ్ళు' (విరిగి) పోతాయి. [మరి తను మీ వ్యాఖ్య చదివితే అంతేగా?;)] ఏం జరిగినా నా పూచీ మాత్రం కాదు :P. Just kidding. :)

మురారి said...

>>"..हम and జెర్రి.."
Title బాగుంది.
>>అ వేసవి చల్లగా లేదు [అప్పటికి గోదావరి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు మరి!].
:)

>> కొత్తగా పెళ్ళయిన మా పిన్ని.. "అమ్మో! మా ఆయన!" అంటూ బెడ్రూం వైపు చీపురుకట్టతో పరుగు తీసింది. ;)
అతడు సినిమాలో బ్రహ్మానందం భార్య పాత్ర గుర్తుకువచ్చింది. (అన్యధా భావించకండి. take in a lighter vein)

>>నిద్రలో ఉండగా సడన్ గా లేపితే ఎవరినైనా పీకుతా. అలాగే దాన్ని కూడా పీకాను.
మీతో కొంచం జాగ్రత్తగా ఉండాలన్నమాట.

>>ఎన్ని మధుర స్మృతులో బాల్యంలో...
నిజమే!.. బాల్యమంత అందమైన కాలం మరొకటి లేదు.

మోహన said...

@మురారి
:)Thank you.