Sunday, September 27, 2009

వాన వెలిసిన ఒక ఉదయం....

నీలం లో తెల్ల మేఘాల జంట వీడ్కోలు పాడుకుంటున్నాయి...,
దూరం గా గిర్రు గిర్రున తిరుగుతూ, తూలుతూ గాలి పటం నిరసన వ్యక్తం చేస్తుంది.
ఒంటరి తూరీగ ఒకటి ఆశగా ఎగురుతుంది.
చెట్ల ఆకుల మధ్య వెలుగు చనువుగా చేరిపోయింది.
తడిసిన ఇసుకలో వాన నీరు ధారలు కట్టి పారుతోంది.

**************************

నిన్నటి వరకూ బొద్దింకల గబ్బు కంపు...
వాన పడిందిలే, అనుకుంటే ఎలుకలు వదల్లేదు, ఈ రోజు కూడా...
ముక్కలుగా కొరికిన వాటిని కుప్పలుగా పోస్తున్నాయి.
వరదొస్తే కొట్టుకుపోయేవేమో....!!
వానొచ్చి చిందర వందర చేసి, ఇప్పుడు గమ్మునుంది.
మట్టిలో కడిగిన చెత్త కొత్త వాసనలు గుమ్మరిస్తుంది.

***************************

దూసుకొచ్చిన కాంతి రేఖను రాలుతున్న చినుకు విచ్చిన్నం చేసింది.
ఎక్కడో... గోడ పగుళ్ళ వెలితుల్లో ఒక విత్తు మొలిచింది.

3 comments:

Purnima said...

Nice picturesqueness!

కొత్త పాళీ said...

hmm .. you got me there .. ఒక పక్క నీలంలో తెల్ల మేఘాలేవిటి, ఇంకో పక్క బొద్దింకల గబ్బేవిటి .. ఏదన్నా కొత్తకాలపు సర్రియలిజమా?

మురారి said...

భావంలో చాలా ఇంటెన్సిటీ గోచరించింది. దృక్పధంలోని విన్నూత్నత వలన చాలా striking గా ఉంది.. and many parallel references..

>>ఎక్కడో... గోడ పగుళ్ళ వెలితుల్లో ఒక విత్తు మొలిచింది.
ఈ వాక్యం లేకుండా end అయ్యుంటే బావుంటుందనుకుంటా.
quite experimental..నాకు బాగా నచ్చింది.