వెన్నెలని పిడికిలిలో పట్టి, నా గది సరుగులో దాచేస్తా..
సముద్రపు కెరటాన్ని ఎత్తుకుని, నాతో పట్టుకెళ్ళిపోతా..
చంద్రుడికి గేలం వేసి, రోజంతా నాతో పాటు ఉంచేసుకుంటా..
పక్షం రోజుల లెక్క సూర్యుడికి అప్పచెప్పేస్తా..
మబ్బులతో దోస్తీ కట్టీ, ఇంటికి మోసుకొచ్చేస్తా..
రెయింబో రంగులు తెచ్చి, ఎండిన పూలకు పూసేస్తా..
చీకటి దుప్పటికి కన్నం పెట్టి, ఆవల ఎముందో చూసేస్తా..
చెట్లను రిక్వష్ట్ చేసి, మనకోసం స్పెషల్ లిఫ్ట్ అరేంజ్ చేయిస్తా..
గాలి మీద సవారి చేసి, పొగనంతా చెరిపేస్తా, ధూళాంతా కడిగేస్తా..
చుక్కలకు మాటలు నేర్పి, పాటలు పాడించేస్తా..
కొండతో చేరి, కోతి కొమ్మచ్చి ఆడేస్తా..
నువ్వు నాతో వస్తే, నా చెగోడీలన్నీ ఇచ్చేస్తా !
నేస్తం, నా జత వస్తావా.. ??
17 comments:
ilaa piliste evaru jatakattaru? chaala, chaala baagundi.
థాంక్స్ మురారి :)
బాగుంది మోహన గారు.
tallI tallI, A panEdO cEddU .. appuDannA mA AfIsuki O vAraM rOjulu SalavostuMdEmO!
Good one.
చివరాఖరి వాక్యం లేకుంటే బాగుండు.
chala bagundhi.
good one!
నేను ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాను తెలుసా నీ కోసం?? :-) మరేమో ఇక్కడికి ( dileep.ekanthapu@gmail.com ) వస్తే కలుస్తా... :-)
@కొత్త పాళి గారు
నాకైతే చివరి వరస లేకుంటే అసంపూర్ణంగా తోచేది. చిన్న వయసులో ఇలా చెయ్యాలనుకునేవి నేస్తాలతో కలిసే కదా?
మాటల మూటలు కట్ట
కబుర్ల దొంతరలు పేర్చి
ఆటలు ఆడిస్తానని
పాటలు పాడిస్తానని
అందరినీ బాగా ఊరించారు
నేనొస్తే ఒంటరిగా మాత్రం రాను
గుంపు మిత్రులందరినీ వెంటపెట్టుకొస్తాను.
మరి చెకోడీలు సిధ్ధం చేసుకోండి.
..........తెలుగుకళ - పద్మకళ.
www.telugukala.blogspot.com
@చైతన్య
Thank you.
@కొత్త పాళీ
మీరు ఆమాత్రం ప్రోత్సాహం ఇస్తే చాలు.. ఇక మనకు అడ్డేది ? :)
అవునండీ నిజమే, చివరాఖరి లైన్ లేకపోయినా బాగానే ఉంటుందేమో.. కానీ నేస్తం జత దొరుకుతుందో లేదో అన్న ఆత్రం నేస్తం నోరు విప్పే దాకా ఆగుతుందటండీ..? అహం ఐతే ఆగుతుంది కానీ..
Thank you
@aditya, Purnima
Thank you.
@ఏకాంతపు దిలీప్
నమస్తే దిలీప్ గారూ.. చాన్నాళ్ళాకి మీ దర్శనం. అంతా క్షేమమేనా?? ఎప్పటినుండో ఎదురుచూస్తూ మరి ఇప్పటి దాకా చెప్పలేదేమండీ..? :) సరే, అక్కడ కలుద్దాం.
Thank you.
@telugukala
చాలా సంతోషం అండీ. తప్పకుండా అందరినీ తీసుకురండి. చెకోడీలు granted అందరికీ..:)
Thank you.
beautiful
bollojubaba
చాలా బాగుంది మోహన గారు.
@బొల్లోజు బాబా గారూ, వేణూ శ్రీకాంత్ గారూ
Thank you
బావుందండి.
" వెన్నెలని పిడికిలిలో పట్టి, నా గది సరుగులో దాచేస్తా.."
దీనికి మాత్రం నేను ఒప్పుకోను. అబ్బ ఆశ.....మీరొక్కరే వెన్నెలని వుంచేసుకున్దామని ......
ఈ పోస్ట్ చదివిన తర్వాత నేనైతే చేగోడీలు ఇవ్వకపోయినా వచ్చేస్తా....
P L Sekhar
>>మీరొక్కరే వెన్నెలని వుంచేసుకున్దామని ......
అబ్బే లేదండీ.. వచ్చే నేస్తాలతో పంచుకుందామని ..... :)
>>ఈ పోస్ట్ చదివిన తర్వాత నేనైతే చేగోడీలు ఇవ్వకపోయినా వచ్చేస్తా....
haha. Sure... Sure. You are welcome.
chala baagundi..!!
నేనవన్నీ ఇవ్వలేను గానీ నా చిన్నిలోకంలో కాస్త చోటిస్తా మరి నువ్వు చెప్పు నాతో దోస్తీ చేస్తావా? :)
@sujji
Thank you.
@రాధిక
hmm.. EverReadyగా ;)
Post a Comment