Friday, October 24, 2008

..చీకటి బావి..

చీకటి బావిలోకి తొంగి చూస్తున్నా..
లోతు ఎంతుందో తెలియట్లే..!
ఓర్పు తాటికి నిబ్బరం చేద వేసి తోడుదునా..?
ఏమీ తగలట్లేదు, కనిపించట్లేదు!!
తాడును పేనుతూ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించా.
పడ్డాయి, కానీ ఉప్పు నీళ్ళే..!!

ఇది పాడుబడ్డ, ఉప్పు నీటి, చీకటి బావా ?
లేక, నిశ్శబ్ధ అనంత సాగర ముఖ ద్వారమా..???

వద్దన్నా ఎగసి పడే ఆశల అలలు నీ సొంతమా..??
కాదనుకున్నా, కదలలేక కావలించుకున్న కలలు మిగిల్చిన కన్నీటి సెగ....?

4 comments:

కొత్త పాళీ said...

cool

వర్మ said...

అయ్యో !

ఏకాంతపు దిలీప్ said...

దేనికీ కలత? ఆశల అలల ఉప్పదనపు పార్శ్వాన్నే ఎందుకు చూస్తున్నావు?

మోహన said...

@కొత్త పాళీ గారూ
Thank you.

@వర్మ
:) హ్మ్.. అయ్యో !

@దిలీప్ గారూ..
అది ఏరి చూసింది కాదు. సముద్రం ఎంత ఇష్టమైనా, అందులోని నీరు ఉప్పగానే ఉంటాయి. కన్నీళ్ళు కూడా అంతే.... అవి ఆనందం వల్ల వచ్చాయని తియ్యగా ఉండవు కదా...?!